calender_icon.png 30 August, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువు, క్రీడలు విద్యార్థికి ఎంతో ముఖ్యం

30-08-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): విద్యార్థికి చదువు, క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడల్లో ప్రావీణ్యం సాధిస్తే దేహదారుఢ్యం పెంపొందడంతో పాటు ఉద్యోగ ఉపాధి దక్కుతాయని మహబూబా బాద్ డిఎస్పి తిరుపతిరావు అన్నారు.  మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సంద ర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం, ఫిజికల్ డైరెక్టర్ కే.రాజేందర్ ఆధ్వ ర్యంలో వన్ కే రన్ నిర్వహించారు.

జాతీయ స్థాయిలో రాణించిన కేసముద్రం మండలానికి చెందిన 10 మంది హాకీ, బాస్కెట్బాల్ క్రీడా కారులకు సన్మానం చేయడం జరి గింది. 25 వేల విలువైన క్రీడా సామాగ్రి బాస్కెట్బాల్స్, హాకీ స్టిక్స్, బ్యాడ్మింటన్ రాకెట్స్, వాలీబాల్స్, టెన్నికోల్ రింగ్స్ వేం ట్రస్ట్ ద్వారా  పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ ఘంటా సంజీవరెడ్డి, సిఐ సర్వయ్య, ఎస్త్స్ర మురళీధర్ రాజ్, ట్రాన్స్పోర్ట్ అధారిటీ మెంబర్ రావుల మురళి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, బండారు దయాకర్, సతీష్, కదిర సురేందర్, స్థానిక హెచ్‌ఎం బి.రాజు, ఎంఈఓ కాలేరు యాదగిరి, పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, దామల్ల విజయ్ చందర్ పాల్గొన్నారు.