calender_icon.png 27 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్

27-09-2025 01:51:03 AM

నారాయణఖేడ్ ,సెప్టెంబర్ 26:నారాయణఖేడ్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆధ్వర్యంలో అంగన్వాడీ సిడిపిఓ సుజాత, అంగన్వాడి టీచర్లతో కలిసి సబ్ కలెక్టర్ బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

స్థానిక అంగన్వాడి టీచర్లతో కలెక్టర్ ఉమా హారతి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాత తాసిల్దార్ హసీనా, ఏ సి డి పి ఓ సుశీల సూపర్వైజర్లు జమున సుజాత ప్రమీల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న టిఎంసి అనిత, జ్యోతి ,నాగలక్ష్మి , సీసీ వాజీ సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తాసిల్దార్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.