calender_icon.png 27 September, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ

27-09-2025 01:52:27 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు, సెప్టెంబర్ 26 :తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించి మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ పేరును హైదరాబాదులోని మహిళా విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకటేష్, రజక సంఘం అధ్యక్షుడు మహేష్, రజక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.