23-09-2025 12:31:52 AM
- హయత్ నగర్ డివిజన్‌లోని పలు కాలనీలను ముంచెత్తిన వరద
- భారీ వర్షాలకు తోడైన మసాబ్ చెరువు అలుగు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 22 : భారీ వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా కాలనీలు నీట మునిగాయి. ఆదివారం సా యంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ డివిజన్ అతలాకుతలం అయింది. ముఖ్యంగా శివారు కాల నీలు నీట మునిగాయి. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని పద్మావతీనగర్, సాహెబ్నగర్ వేం కటేశ్వర ఆలయం వద్ద మొకాలి లోతు నీరు నిలిచాయి. తుర్కయంజాల్ లోని మసాబ్ చెరువు అలుగు పారుతుండడంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది.
జలదిగ్బంధంలో బస్తీలు
హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట కాలనీ పూర్తిగా నీట మునిగాయి. వీధుల్లోకి నడుం లోతు వ రకు నీరు చేరింది. ఈ కాలనీలు ప్రతి వానాకాలంలో జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. ముంపు నివారణకు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినా పూర్తి స్థాయిలో ముంపును నివారించలేక పోయాయి. బంజారా కాలనీ, రం గనాయకులగుట్ట కాలనీ ప్రజలు పూర్తిగా రో జువారీ కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, మహిళలు పారిశుద్ధ్య కార్మికులుగా, కొందరు మ హిళలు భవన నిర్మాణ కూలీలుగా పని చేసి జీవిస్తున్నారు.
ఆదివారం రాత్రి కురిసిన వ ర్షం బస్తీ వాసులకు కన్నీళ్లు మిగిల్చాయి. తె ల్లవారేసరికి ఇండ్లలోకి వరద చేరింది. బం జారా కాలనీ పూర్తిగా నీట మునిగింది. రంగనాయకులగుట్టలో రెండు వీధులు జలది గ్బంధంలో ఉన్నాయి. ఆయా ఇండ్లలోకి నీరు చేరడంతో పిల్లలు, మహిళలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. సీతారాంపురి కాలనీలో పలు ఇండ్లలోకి నీరు చేరింది. మో టార్లు వేసి, ఇండ్లలో చేరిన నీటిని బయటకు పంపిస్తున్నారు.
సహాయం చర్యలు చేపట్టిన అధికారులు
హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లలో నీట మునిగిన కాలనీల్లో వివిధ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాల నీ, రంగనాయకులగుట్ట కాలనీలు జీహెచ్‌ఎంసీ, డీఆర్డీఎఫ్ అధికారులు, సిబ్బంది నీటి ని తొలిగించే పనులు ప్రారంభించారు. జేసీ బీ సాయంతో నాలాల్లో చేరిన పూడికను తొ లిగిస్తూ వరదను బయటకు పంపిస్తున్నారు. వీధుల్లోకి నీరు చేరడంతో ఇండ్లలో ఉన్నవారికి ఆహారం అందిస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటన
హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లలోని ముంపు ప్రాంతాలను ప్రజాప్రతిని ధులు పర్యటించారు. బంజారా కాలనీ, రంగనాయకులగుట్టలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కా ర్పొరేటర్ నవజీవన్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామనిహామీఇచ్చారు.
వరదలతో తుర్కయంజాల్ ప్రజల అతలాకుతలం
తుర్కయంజాల్, సెప్టెంబర్ 22:భారీ వర్షాలతో తుర్కయంజాల్ మాసాబ్చెరువు పొంగిపొర్లుతోంది. అలుగు నుంచి పెద్ద ఎ త్తున నీరు దిగువకు పారుతోంది. వరద కారణంగా చెరువు దిగువన ఉన్న ఆపిల్ ఎవె న్యూ కాలనీకి రాకపోకలకు పూర్తిగా స్తంభించాయి. తొర్రూరు-ఇంజాపూర్ మధ్య కల్వ ర్టుపైనుంచి వరద పారుతోంది. దీంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ఎక్కువగా పారుతుండటంతో అటుగా వెళ్లిన కారు కల్వర్టు దగ్గర ఇరుక్కుపోయింది.
జేసీబీలు, క్రేన్ల సాయం తో కారును వెలికి తీశారు. అలాగే రాత్రి కురిసిన వర్షంతో వాగులో ఓ బైక్ కొట్టుకు పోయింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాల వల్ల అనేక కాలనీలు ఇప్పటికీ నీట మునిగే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించి, బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ మరో రెండుమూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.
‘సీపీఎం నేతల పర్యటన’
భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న ఇంజాపూర్ ఆపిల్ ఎవెన్యూ కాలనీని స్థానిక సీపీఎం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు వర్షాలు వచ్చినా ఈ కాలనీ ప్రజలు అవస్థల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అ పార్ట్మెంట్ మీదుగా వరద పారుతుండటం తో యజమానులు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తుండటం బాధాకరమని అన్నారు. వాగు ఆక్రమ ణకు గురికావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. వాగుపై నిర్మించిన నాలా పైకప్పు వరదకు కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. పక్కనే ఉన్న టెంట్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున సామాను వరదలో కొ ట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం. సత్యనారాయణ, ఇల్లూరి భాస్కర్, పి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధుల పర్యటన
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 22 : ఆదివారం కురిసిన భారీ వర్షాలకు హయత్ నగర్, బీ ఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు నీ ట మునిగాయి. ముఖ్యంగా హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా నీట మునగడంతో సో మవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఇతర శాఖల అధికారులు ఉదయం నుంచి అన్ని విభాగాల అధికారులను సమన్వయపరచుకుం టూ సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు తక్షణసాయంగా రూ, 20 వేలు ఇ వ్వాలని, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంజపూర్ చెరువు నుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే ఇట్టి కాలనీలు మునిగాయన్నారు.
నూతన ట్రంక్ లైన్ పనులు త్వరలోనే ప్రారంభించి, సకాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు గుడాల మల్లేష్, భాస్కర్ సాగర్, డీఈ దా మోదర్, బీజేపీ నాయకులు గంగాని శ్రీనివా స్, జంజ్య నాయక్,వస్పరి వెంకటేష్, గో పాల్ నాయక్, శంకర్ నాయక్, బాలు నా యక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
శివారు ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చేయాలని కా ర్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి డిమాండ్ చేశా రు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో వినూత్న కాలనీ, గాంధీ నగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ, స్నేహమయి నగర్ కాలనీ, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, గాయత్రి నగర్ పరిసర కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ జోనల్ క మిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ... గుర్రంగుడ అడవి ప్రాంతం నుంచి భారీ వరద రావడంతో అ డ్డుగా ఉన్న కట్ట తెగి వినూత్న కాలనీ మీ దుగా వరద నీరు ప్రవేశించిందన్నారు. త ద్వారా వినూత్న నగర్ గాంధీనగర్ సౌత్ అ ఖిలాండేశ్వరి కాలనీ స్నేహమే నగర్ పివిఆర్ కాలనీ పద్మావతి కాలనీలు నీట మునిగాయన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్‌ఈ అశోక్ రెడ్డి, డీఈ దామోదర్ రెడ్డి నగర్, ఏఈ కార్తీక్, జలమండలి మేనేజర్ సిరివెన్నెల, ఇరిగేషన్ విభాగం ఏఈ సతీష్ కుమార్‌ఉన్నారు.