calender_icon.png 9 September, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుదర్శన్‌రెడ్డిని గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

08-09-2025 01:24:38 AM

జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి పలువురు మేధావులు సంఘీభావం

ముషీరాబాద్, సెప్టెంబర్ 7(విజయక్రాంతి): త్వరలో జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ’రాజ్యాంగ అమలుకు- రాజ్యాంగ విధ్వంసానికి’ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, కాపాడుకోవాలంటే తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు విశ్రాం త న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవాలని వారు కోరా రు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంఘీభావంగా ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ. కోదండరాం, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి. హరగోపాల్, విద్య కమిషన్ సభ్యులు పిఎల్. విశ్వేశ్వర్ రావు, సీనియర్ సంపాదకులు కే. రామచంద్రమూర్తి, కే. శ్రీనివాస్, డాక్టర్ వనమాలిక లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎ. కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగ విలువల రక్షణకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయా లన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిఫా ర్సు చేయడం వల్ల, బిఆర్‌ఎస్ పార్టీ ఓటు వేయమని చెప్పడం సరికాదన్నారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి అని గ్రహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర కూడా ఉందనే విషయాన్ని బిఆర్‌ఎస్ గ్రహించి, ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత వారిపై ఉందన్నారు. ఆయన గెలుపు తెలుగు జాతి వికాసానికి మరింత దోహదం చేస్తుందని అన్నారు.

ప్రొఫెసర్ జి. హరగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగ అమలు కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి జీవితాంతం పాటుపడ్డారని, చరిత్ర, న్యాయ శాస్త్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్న ఆయనను గెలిపించాలని కోరారు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, తన 55 ఏళ్ల బోధన వృత్తిలో ఏనాడు తరగతి గదుల్లో ఈ అంశం బోధించాలి, ఇది బోధించకూడదు అనే ఆంక్షలు లేవన్నారు. కానీ నేడు విశ్వవిద్యాలయలలో బోధన అంశాలపై అధ్యాపకులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మీడి యా అకాడమీ ఛైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవీ రాష్ట్రపతి పదవీ లాగా కాదని రాజ్యసభలో ఛైర్మెన్ గా కూడా కీలక బాధ్యతలు వహిస్తారన్నారు. అలాంటి కీలకమైన పదవీకి ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్నారు.

పిఎల్ విశ్వేశ్వర్ రావు, రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, డాక్టర్ వనమాలిక లు మాట్లాడుతూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపుకు 82 ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయని, బిఆర్‌ఎస్, టిడిపి, జనసేన, వైఎస్సా ర్ సీపీ పార్టీల ఎంపీలు ఆయనకు ఓటు వేస్తే గెలుస్తారని స్పష్టం చేశారు.