11-10-2025 07:34:36 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన ఎం.డి సలీం భాష తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ... హైదరాబాద్ నగరం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని అదే గ్రామానికి చెందిన సన్రైస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రభు కుమార్ 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆయన కోరారు.