26-05-2025 12:00:00 AM
తూర్పు ఉదయం
భైరవి రాగ చరణ కిరణాలు
జగతికి హారతి గీతం పాడుతున్న సందర్భంలో
నింగిని అంటుకున్న బంగారు కాను బిళ్లకు
నమస్కరిస్తున్నాడు.....
మనిషి స్వాగతిస్తూనే వున్నాడు.
ఎండ చర్నాకోలు తీసుకుని తాడిస్తుంటే
చల్లదనం కోసం అర్రులు చాస్తున్నాడు
ఐనా, వేడి ఉపశమనం దొరకడంలేదు
ఈ గాడ్చు మానంలో
నూర్యుడికి ఎందుకు కోపం
వస్తుందో తెలియదు.
చెట్లు సైతం తమ వచ్చదనం విప్పేసుకొని
బోసి మొలతో సాగిలపడుతున్నాయి.
కాస్తంత పచ్చదనం ఉన్న చెట్టుని
నీడ కోసం మనిషి పరిగెడుతున్నాడు.
దుమ్ము ధూళి సూర్యుడి ముఖాన్ని
అలుముకున్నప్పుడూ
అందుకే ఆ వేడి కోపం ఎండ మంట
సవాలక్ష కారణాలతో
ఎండ జ్వరం రాజుకుంటుంది.
మనిషి ఎండ బునలకు పరుగులు తీస్తాడు
చవితి రోజు కృష్ణుడు క్షీరంలో
చంద్రుడ్ని చూసి
నీలాపనిందలు పాలయినట్లుగానే
ఈ ఎండ నీడచూపు పడకూడదని
ప్రయత్నిస్తాడు.
గదులలో పంఖాలు
గాలి చిలుకుతుంటాయి.
ఇంట్లో విసిన కర్ర మూలనపడింది
అప్పుడప్పుడు ఏసీ గదులు సైతం
మూగబోతున్నాయి.
ఇప్పుడు ఎండకు ప్రాంతంతో పనిలేదు
సర్కారువారి పన్నులలా
బాదుతూనే ఉంటుంది.
ఈ మూడు నెలలు గడిచేవరకూ
జీవితంతో పోరాడుతున్న మనిషి
ఎండతోనూ పోరాడతూనే ఉంటాడు.
ఎండకాటుకు
అరకొర ఊపిరి ఆగిపోతున్న వార్తలు తెలిసి
కంగారు పడుతూనే ఉంటాడు.
ఎండ మంట రగులుతూనే ఉంటుంది.
ఎవరికో చితి పేర్చాలని
ఎండలో స్నానం చేస్తున్నవాడు ధరంజీవి
ఎండ వెన్నెలలో తడుస్తున్నవాడు అమరజీవి
నిజానికి
మన అభివృద్ధి సంఖ్యలను చూసి మురిసిపోతాము
కానీ, ఎండ అభివృద్ధిని చూసి
ఓర్వలేని తనం మనది
ఎండ మాత్రం మడం తిప్పదు-
తన రుతుచక్రం పూర్తయ్యేవరకూ
మనిషి బెంబేలు ఎత్తకతప్పదూ
శరీరంలో నీటిశాతం పడిపోకుండా
నిమ్మరసాలు, చెరుకు రసాలు ఓదారుస్తాయి
చెట్లను కుమ్మరి పురుగులా తొలిచేస్తే
ప్రకృతి మనిషి జీవితాన్ని విరిచేస్తుంది.
ప్రకృతి ధర్మాన్ని శాసించాలని చూసినప్పుడూ
రుతువులు తిరగబడతాయి
కాలానికి ఎదురీత మనిషి ప్రయాణం-
అది ఎండయినా, వానయినా, చలిమంటయినా
మనిషిని వేధిస్తుంది, బాధిస్తుంది.
ఎండ వేడి మనిషిని ఎంత కలవరపరిచినా...?
మామిడి రుచుల నీడ పత్రాలు,
తియ్యని తాటి ముంజలు సేదతీర్చే నేస్తాలు
వసంతంలో ఎండలు వేడికావు కాచినా?
కష్టసుఖాల మేలు కలయికల
ఆనందాల తీపి గుర్తులు.
అది
ఎండకాలం, ప్రకృతి కడుపు మండే కాలం.
మానవా ! ఇక మానవా!!
మారవా ! నీ కోరికలు తీరవా!?