15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మెడిసిటీ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ సేవలు

30-12-2025 01:53 AM

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 29(విజయ క్రాంతి): మేడ్చల్ పరిసర ప్రాంతాలకు గత రెండు దశాబ్దాలుగా ఆరోగ్య సేవలు అందిస్తున్న మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ అనుబంధ మెడిసిటి హాస్పిటల్స్ వారు జనవరి నుండి సూపర్ స్పెషాలిటీ సేవలను పూర్తి స్థాయిలో అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇందుకోసం సోమవారం ప్రత్యేక సదుపాయాలతో కూడిన సరికొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను హాస్పిటల్ ఆవరణలో ప్రారంభించారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  వి యస్ వి ప్రసాద్, వ్యవస్థాపకులు, లోటస్ గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మ జి శ్రీనివాస రాజు  హాజరై  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె శివరామ కృష్ణ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా మెడిసిటి హాస్పిటల్ పలు ఆరోగ్య సేవలను అందిస్తోందని, అయితే పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించకపోలేకపోవడంతో రోగులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు అందుచేత వీటిని రోగులకు అందుబాటులోనికి తెచ్చామని వివరించారు.  ప్రస్థుతం కార్డియాలజీ, న్యూరాలజి, యూరాలజీ, వ్యాస్కులర్ సర్జరీ వంటి సేవలను అందుబాటులోనికి తెచ్చామని త్వరలోనే ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా ప్రారంభమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  వి యస్ వి ప్రసాద్, వ్యవస్థాపకులు, లోటస్ గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తో పాటూ  జి శ్రీనివాస రాజు, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ సభ్యులు  ఫ్రొఫెసర్ కె శివరామ కృష్ణ, ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐనిష్ మర్చంట్, ముఖ్య కార్యనిర్వహణాదికారి, మెడిసిటి హాస్పిటల్స్ డా. దేవేంద్ర సింగ్ నేగి, మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ డా. గీత, మెడికల్ డైరెక్టర్, మెడిసిటి హాస్పిటల్ తో పాటూ పలువురు వైద్య విభాధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.