30-12-2025 01:55:33 AM
పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
జగిత్యాల క్రైం, డిసెంబర్29(విజయక్రాంతి):ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పక్కా కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పిల్లలు, పెద్దలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇండ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నూతన సంవత్సరం ఆనందంగా ప్రారంభం కావాలి గానీ, నిర్లక్ష్యం వల్ల విషాదంగా మారకూడదు అని పేర్కొన్నారు.నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్న ట్లు తెలిపారు.
పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు ప దార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ కు జిల్లా ప్రజల సహకరించాలని కోరారు.