calender_icon.png 15 May, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

15-05-2025 12:58:39 PM

న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibowli lands)పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఎస్ తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా స్పష్టం చేయాలని, లాంగ్ వీక్ ఎండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌(CJI Justice Gavai) ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని సీజేఐ తెలిపారు.

కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై కేసుల విషయాన్ని పలువురు లాయర్లు ప్రస్తావించారు. కేసులు కొట్టేయాలని న్యాయవాదులు అప్లికేషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ తో కలిపి విచారించడం కుదరని సీజేఐ గవాయ్ చెప్పారు. కేసులు కొట్టేయాలన్న అప్లికేషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. అవసరమైతే మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ బాధ్యతలు చేపట్టాక కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తొలి విచారణ. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వంపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు  వినియోగించారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీకోర్టు జులై 23కి వాయిదా వేసింది.