calender_icon.png 26 July, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన ఆలయం కోసం థాయి-కంబోడియా కొట్లాట

25-07-2025 12:00:00 AM

  1. సరిహద్దుల్లో యుద్ధవాతావరణం
  2. ఇప్పటికే థాయి ప్రధాని షినవత్రాపై వేటు 
  3. ఎఫ్-16 జెట్లతో పోరాడుతున్న ఇరు దేశాలు
  4. వేయి సంవత్సరాల నాటి హిందూ దేవాలయం కోసమే ఇదంతా? 
  5. ప్రాణాలు కోల్పోయిన 12 మంది థాయిలాండ్ వాసులు 

న్యూఢిల్లీ, జూలై 24: ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా నువ్వెంత? అం టే నువ్వెంత అంటూ యుద్ధరంగంలోకి దిగా యి. పురాతన హిందూ దేవాలయం కోసం ఈ రెండు బౌద్ధదేశాలు కయ్యానికి సై అన్నా యి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే ప్రీహ్ విహార్ అనే హిందూ దేవాలయం కోసం కదనరంగంలోకి కాలుపెట్టాయి. శతాబ్దకాలం నుంచి ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు ఘర్షణ పడుతుండటం గమనార్హం.

ఇరు దేశాల ఘర్షణల్లో సరిహద్దుల్లో 12 మంది థాయి ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు థాయిలాండ్ అధికారులు ప్రకటించారు. వీరిలో 11 మంది సాధారణ పౌరులు కాగా.. ఒకరు థాయిలాండ్ సైనికుడు. మరో 31 మంది గాయ పడగా.. అందులో 24 మంది సాధారణ పౌరులు, ఏడుగురు సైనికులు ఉన్నారని థాయిలాండ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కంబోడియాతో సరిహద్దును మూసివేస్తున్నట్టు థాయిలాండ్ ప్రకటించింది.  

ఎఫ్-16 రాకెట్లతో దాడులు.. 

గురువారం సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది. రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. థాయిలాండ్‌లోని సిసా కెట్ ప్రావిన్స్ ఈ దాడుల్లో బాగా దెబ్బతింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు డ్రాగన్ కంట్రీ చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయినా కానీ ఈ రెండు దేశాల నడుమ ఘర్షణలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ ఘర్షణలు ఇంకా పెరిగాయి.

ఈ రెండుదేశాల నడుమ మందుపాతరల అంశం రచ్చకు దారి తీసింది. వివాదాస్పద ప్రదేశాల్లో ల్యాండ్‌మైన్స్ పేలడంతో థాయి సైని కులు గాయాలపాలయ్యారు. ఇది తమ ప్రదేశంలోనే జరిగిందని థాయ్ చెబుతుండగా.. ప్రీహ్ విహార్ ఆలయ పరిసరాల్లో జరిగిందని కంబోడియా వాదిస్తోంది.

ఈ వివాదం ముదరడంతో థాయ్ వాయుసేనకు చెందిన ఆరు ఎఫ్-16 యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. కంబోడియాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులతో జరిపిన సంభాషణకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ వైరల్ కావడంతో థాయి ప్రధాని షినవత్రాపై వేటువేస్తూ రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

అసలేంటీ వివాదం.. 

ఈ రెండు దేశాలు ఓ ప్రాచీన హి ందూ దేవాలయం కోసం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ రెం డు దే శాల సరిహద్దుల్లో 11వ శతాబ్దానికి చె ందిన హిందూ దేవాలయం ఉంది. పీ హ్ విహార్ అనే ఈ దేవాల యం కో సమే ఈ రెండు దేశాలు ఘ ర్షణలకు దిగాయి. ఈ వివాదం గడిచిన 1000 ఏండ్ల నుంచి నడుస్తూనే ఉంది. ఈ రె ండు దేశాలు 800 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నా యి.

1953 వరకు కంబోడియా ఫ్రెం చ్ వారి ఆధీనంలో ఉండేది. ఆ పాలకులే క ంబోడియాకు సరిహద్దును నిర్ణయించారు. దీనిపై 1907లో ఒప్పం దం కుదిరింది. కానీ థాయిలాండ్ ఈ సరిహద్దు మ్యాప్‌ను సవా ల్ చేస్తూనే వ స్తోంది. పురాతన ఆలయం కంబోడియాలో ఉండటం థాయిలాండ్‌కు ఏ మాత్రం నచ్చలేదు.

దీంతో 1959 లో థాయిలాండ్ ఈ విషయంపై అం తర్జాతీయ కోర్టు గడప తొక్కింది. కానీ ఆలయం కంబోడియాకే చెందుతుందని కోర్టు తీర్పుని చ్చింది. కంబో డియా విజ్ఞప్తి మేరకు ఈ ఆలయా న్ని 2008లో యునెస్కో ప్రపంచ వా రసత్వ సంపదగా గుర్తించడాన్ని థా యిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది.