calender_icon.png 10 May, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరేపల్లి సుజాతను అరెస్ట్ చేయాలి

08-05-2025 01:22:35 AM

బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ‘ఆపరేషన్ సిందూర్’ పట్ల దేశమంతా గర్వంగా స్పందిస్తున్న వేళ రాష్ర్ట విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత అభ్యంతరకరంగా హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉగ్రవాదుల దాడిలో అమాయక 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు బదులుగా, ఉగ్రవాదులపై కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రొఫెసర్ సుజాత శవాలు, శకలాలు, రక్తసింధూరం అంటూ అపహాస్యం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి ప్రభుత్వ పదవుల్లో కొనసాగడం రాష్ర్ట ప్రజలకు, యువతకు, విద్యార్థులకు తప్పుదారి చూపే అంశమన్నారు. సుజాతపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.