calender_icon.png 18 August, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందహెచ్చుల వాద్యం

11-12-2024 12:00:00 AM

ఇది బాకా వాద్యం. ఇందులో సుర్నా. నపీర్ అనే రకాలు ఉన్నాయి. అక్బర్ చక్రవర్తి వాద్య కూటమి అయిన ’నౌబత్కానా’లోని ఏడు రకాల వాద్యాలలో ఇది ఒకటి. మన దేశీయ బూరల వంటిదే. కాని వీటిని ఇత్తడి, కంచు వంటి లోహాలతో తయారుచేస్తారు. ఐరోపాలో ఇలాంటి వాద్యాల వాడకం ఎక్కువ. వీటి శబ్దాన్ని దేశీయంగా వాయించడానికి వీలుగా తయారుచేశారు. శబ్దాన్ని బిగపట్టి, ఆపి, రాగతాళానుగుణంగా వాయిస్తారు. ఈ వాద్యాలు జానపద ప్రదర్శనలలో ఎలా, ఎప్పుడు వచ్చి చేరాయో తెలియదు.

ఈ వాద్యాన్ని యాదవుల ఉపకులం అయిన ‘మందహెచ్చులు’ కథ చెబుతున్నప్పుడు మధ్య మధ్యలో వాయిస్తారు. వీరి సంస్కృతికి దగ్గరగా ఉన్న ఒగ్గు తదితర వాద్యాలతో పాటుగా వాయిస్తారు. నపీరాని కాలసూచికగా కూడా మోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో వేకువ జామున ఊరివారిని నిద్రలేపి పనులకు వెళ్ళేందుకు వీలుగా దానిని మోగిస్తారు. నపీరా అలా ఒక ప్రయోజనకరమైన పాత్ర పోషిస్తుంది. మరోవైపు జానపద కళా ప్రదర్శనలలో ఒక కొత్తరకం శబ్దాన్ని సృష్టించి జానపద వాద్యంగా మారిపోయింది. దీని లక్షణం కేవలం తెలంగాణాలోనే కనుపిస్తుంది.