30-01-2026 01:47:15 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి ౨౯ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో వచ్చే రాజకీయ వార్తలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని డిపిఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ (మీడియా సెంట ర్) ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదన పు కలెక్టర్ (రెవెన్యూ)కిషోర్ కుమార్, డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోజువారీగా వార్త పత్రికలు, లోకల్ చానళ్లలో వచ్చే వార్తలను ప్రతిరోజు నిశితంగా గమనిస్తూ ఉం డాలన్నారు. అనుమానిత పెయిడ్ న్యూస్ వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని రకాల రిజిస్టర్లను జాగ్రత్తగా నమోదు చేయాలని పేర్కొన్నారు. వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై నిఘా ఉంచాలని తెలి పారు. ఈ మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.