calender_icon.png 30 January, 2026 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి

30-01-2026 01:45:48 AM

కలెక్టర్ హరిత

కాగజ్‌నగర్/కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 29(విజయ క్రాంతి): రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత అన్నారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి ఆమె పరిశీలించారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డులకు 15 కౌంటర్లలో నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసిల్దార్ మధుకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రజలతో సహనంగా వ్యవహరించాలి

కలెక్టర్ కె. హరిత గురువారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల కార్యా లయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బం ది హాజరు రిజిస్టర్ను పరిశీలించి సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, ప్రజలతో సహనంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఆలస్యంగా వచ్చే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మున్సి పల్, ఇంజనీరింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.