13-01-2026 12:19:03 AM
గుమ్మడిదల, జనవరి 12 : యువతకు మార్గదర్శకులు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని వీరన్న గూడెంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురభి నాగేందర్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నబోయిన వేణు, హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివేకానంద యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు దృష్టి సారించకుండా దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రజా మనుగడలో మానవతా దృక్పథంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు ఎన్.గణేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ నాగేష్, కార్యదర్శులు కె.సుధాకర్, సిహెచ్ కుమార్, జి.గణేష్, ఎన్.రాజు, బి.విజయ్, ఇ.నాగరాజు, సిహెచ్.నర్సింగరావు, జె.శ్రీను, టి.అశోక్, పి.రాజు, నాయకులు లక్ష్మీనారాయణ, డి.కుమార్, మడుపతి గణేష్, అప్ప, బిక్షపతి, విజయ్, పి.కర్ణాకర్, పి.గిరి, పి.కృష్ణ, పి.రాజు, టి.రాజు, టి.వీరేష్, చందు, ఎజాజ్ పాషా, సంఘం సభ్యులు పాల్గొన్నారు.