calender_icon.png 13 January, 2026 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న మేడారంలో క్యాబినెట్ సమావేశం

13-01-2026 12:17:52 AM

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఈ సారి మేడారంలో నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

అలాగే జనవరి 18న ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి, మధ్యాహ్నం మేడారంలో క్యాబినెట్ భేటీకి సీఎం వెళ్లే అవకాశం ఉంది. ఆ రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్‌రెడ్డి బస చేయనున్నట్లు సమాచారం. 19న ఉదయం సమక్క, సారక్క అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభించి తొలి దర్శనం చేసుకుంటారు. మేడారం జాతర ఏర్పా ట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితిలు, రాష్ర్టంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై క్యాబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.