calender_icon.png 13 July, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీని చాటుకున్న స్వీపర్ లక్ష్మి

16-06-2025 01:51:09 AM

భద్రాచలం, జూన్ 15 (విజయ క్రాంతి) భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లో శుభ్రం చేస్తున్న స్వీపర్ లక్ష్మికి పదివేల రూపాయలు ఉన్న ఒక పర్సు దొరికింది. అది తీసు కువచ్చి స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరావుకి ఇవ్వగా అందులో ఉన్న డబ్బులను లెక్కబెట్టగా పదివేల రూపాయలు ఉన్నట్లుగా గు ర్తించారు.

ఆ పర్సులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పాలడుగు శివ, గుంటూరు వాసి గా గుర్తించి స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరరావు ఆధార్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి డబ్బులు దొరికిన వివరాలు తెలియజేశారు.వెంటనే వారు వచ్చి బ స్టాండ్ లోని అధికారులను కలవగా, స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరరావు సమక్షంలో ప ర్స్ ను లక్ష్మీ చేతుల మీదుగా స్టేషన్ మేనేజర్ సమక్షంలో పట్టు పోగొట్టుకున్న పాలడుగు శివకు అందించడం జరిగింది. దీంతో పలువురు సూపర్ లక్ష్మి నిజాయితీనికొని యాడారు.