calender_icon.png 12 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి

12-09-2025 12:09:26 AM

ఎమ్మెల్యే విజయుడు 

అయిజ , సెప్టెంబర్ 11 పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాను ప్రకటించి వారి కుటుంబాలకు అండగా నిలవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కు విజ్ఞప్తి చేశారు.ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకూ ఆర్థిక సాయాన్ని అందజేశారు.