calender_icon.png 19 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ హెల్త్‌క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

19-09-2025 12:03:15 AM

పెబ్బేరు మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రవళిక

పెబ్బేరు రూరల్, సెప్టెంబర్ 18 : పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లచే స్పెషల్ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రవళిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 20వ తేదీన చిన్న పిల్లల, 23వ తేదీన చర్మవ్యాధుల స్పెషలిస్ట్, 25వ తేదీన గర్భిణీ స్త్రీల స్పెషలిస్ట్, 27వ తేదీన కంటి వైద్యం స్పెషలిస్ట్,

28వ తేదీన సైకాలజి స్పెషలిస్ట్ డాక్టర్ లు అందుబాటులో ఉంటారని వారు తెలిపారు. ఈ క్యాంపు మహిళలకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు, పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల మహిళలు క్యాం పును సద్వినియోగం చేసుకోవాలని, క్యాంపు కు హాజరగు మహిళలు ఆధార్ కార్డుతో రావాలని వైద్యాధికారిని డాక్టర్ ప్రవళిక తెలియజేశారు.