17-01-2026 02:18:31 AM
బాన్సువాడ, జనవరి 1౬ (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి చెందిన యువకులు బిజెపి పార్టీలోకి భారీగా చేరినట్లు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు తెలిపారు. శుక్రవారం కోటగల్లికి చెందిన పద్మ నరేష్, పురుషోత్తం బాలకృష్ణ సతీష్ మోహన్ రవి కిరణ్ సచిన్ వేద ప్రకాష్ శశి కుమార్ భూమేష్ కామారెడ్డి బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడం లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విప్లమయ్యారని. కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని వచ్చే స్థానిక ఎలక్షన్లో బాన్సువాడ మున్సిపాలిటీలో బిజెపి జెండాను ఎగురవేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.