13-01-2026 02:14:51 AM
త్రిశూలం చౌరస్తా వాటర్ ఫౌంటెయిన్ ప్రారంభం
బ్రహ్మోత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులు
భీమదేవరపల్లి, జనవరి 12 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం సోమవారం వాస్తు పూజ హో మం, బలిహరణ గణపతి పూజ, నిత్య హో మాలు, హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగాయి. దేవస్థాన ముఖద్వారం వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన త్రిశూలం చౌరస్తా వాటర్ ఫౌంటెయిన్‌ను ఆవిష్కరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వయంగా సుమారు 20 లక్ష ల వ్యయంతో త్రిశూలం చౌరస్తా ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సఖ్యలో తరలివచ్చా రు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ రామాల సునీత, ఈవో కిషన్ రావు, దేవాలయ ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, ము ఖ్యఅర్చకులు మొగిలిపాలెం రాంబాబు, వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ పాల్గొన్నారు.