calender_icon.png 30 July, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు

29-07-2025 04:40:37 PM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. చివరగా పాత రిజర్వేషన్ల ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారని, ఎలా చేస్తారని అప్పుడు అడిగితే మా వ్యూహం మాకుందని కాంగ్రెస్ నేతలు అన్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నెపమంతా బీజేపీ, బీఆర్ఎస్ మీద వేస్తుందని, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల విషయంలో బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులం కూడా రాష్ట్రపతిని కలిసి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరుతామని తలసాని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు తిప్పికొట్టాలని, అధికార యంత్రాంగంలోనూ కీలకమైన స్థానాలను ఒక అగ్రవర్ణం వారికే ఇచ్చారన్నారు. కార్పొరేషన్ పదవులను సగం బీసీలకే ఇవ్వాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తున్నామని తలసాని వ్యాఖ్యానించారు.