17-09-2025 12:29:58 AM
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి) : ఘట్‌కేసర్ మున్సిపల్ అంకుశాపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల మహేంద్రహిల్స్ లైఫ్ సైన్స్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటారు. ఏఐఐఎంఎస్ బీబీన గర్ సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన డిబేట్ పోటీల్లో ఈకళాశాల నుంచి మూడు జట్లు పాల్గొ న్నాయి.
‘సోషల్ మీడియా ప్రభావంయువతలో ఆత్మహత్యలు పెరగడం‘ మరియు ‘యువత ఆత్మహత్యలను తగ్గించడంలో కృత్రిమ మేధస్సు పాత్ర‘ వంటి సమకాలీన అంశాలపై విద్యార్థులు తమ అభి ప్రాయాలను ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరిచారు. ఈపోటీల్లో బీజేడ్ సి విభాగానికి చెందిన విద్యార్థినులు శారన్, భవాని వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు సా ధించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత, వైస్ ప్రిన్సిపాల్ ఎన్. కవిత విద్యార్థులను అభినందిస్తూ మరిన్ని ఇలాంటి పోటీల్లో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని ప్రోత్సహించారు.