calender_icon.png 17 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం వచ్చే శాఖల్లో బదిలీలకు శ్రీకారం!

17-09-2025 12:27:42 AM

  1. ఎక్సైజ్, వాణిజ్య, రిజిస్ట్రేషన్ శాఖల్లో బదిలీలకు సిద్ధం

ప్రభుత్వం నుంచి జీవో జారీ

సుదీర్ఘకాలం ఒకే చోట ఉన్నవారికి స్థానచలనం

సంగారెడ్డి, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే శాఖల్లో బదిలీలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఆయా శాఖల్లో విధి విధానా లు రూపొందిస్తున్నారు. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు పే ర్కొంటున్నారు.

ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. ఒకేచోట సుదీర్ఘకాలం పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించనున్నారు. సాధారణ బదిలీల సమయంలో అప్పట్లో అన్ని శాఖల్లో బదిలీలు చోటుచేసుకున్నాయి. అయితే సర్కారుకు ఆదాయాన్నిచ్చే ఈమూ డు శాఖలను మినహాయించారు. తాజాగా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా వీరి బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆయా శాఖల్లో ఇలా..

ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న ఎస్త్స్రలకు సంబంధించిన జాబి తా తయారు చేయాలని ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మౌఖికంగా ఆదేశాలు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెండేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారి వివరాలను అధికారులు సేకరి స్తున్నారు. అలాగే కానిస్టేబుళ్లకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొంది స్తున్నట్లు చెబుతున్నారు.

వీరితో పాటు ఉన్నతాధికారుల బదిలీలు కూడా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా సర్వీసు ప్రకారం పదోన్నతులు సైతం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఉద్యోగుల బదిలీలు సైతం ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఖా ళీగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ పోస్టుల్లో ఇతర ప్రాంతాల నుంచి అధికారులు ఇక్కడకు వ స్తారా లేదా అనేది చూడాల్సిందే. ఇక వాణి జ్య పన్నుల శాఖలోనూ బదిలీలకు రంగం సిద్ధమవుతున్నట్ల సమాచారం.

శాఖాపరంగా ఇంకా ఉత్తర్వులు రాలేదు..

ప్రభుత్వం నుంచి బదిలీలకు సంబంధిం చి ఉత్తర్వులు వెలువడినప్పటికీ శాఖా పరంగా రావాల్సి ఉందని, ఆ తర్వాతే ఏయే క్యాడ ర్ ఉద్యోగుల బదిలీలు ఉంటాయనేది స్పష్టత వస్తుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. పదోన్నతులు, బదిలీలు ఒకేసారిగా జరిగే అవకాశం ఉంది.

నవీన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సంగారెడ్డి