calender_icon.png 17 September, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి వరద కష్టాలకు చెక్

17-09-2025 02:33:09 AM

  1. రూ.17.93 కోట్లతో స్టార్ట్ వాటర్ డ్రెయిన్ పనులు

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నగరంలో పౌరసదుపాయాలు మెరుగుపరిచి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోం దని రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్‌చారిజ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందులో భాగంగా నాంపల్లి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు రూ.17.93 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న

భారీ వర్షపు నీటి కాలువ స్టార్ట్ వాటర్ డ్రెయిన్ పనులకు ఆయన మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. వర్షాకా లంలో లక్డీకాపూల్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, రెడ్ హిల్స్, ఏక్ మినార్ మసీదు రోడ్, నేతాజీ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో ఎదురవుతున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ ఈ ప్రాజెక్టును చేపట్టింది.

న్యూ ప్రగతి ప్రెస్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు 2,150 మీటర్ల డ్రెయిన్ నిర్మాణం. చిరాగ్ అలీ లేన్ నుంచి బాంబే బజార్ మీదుగా నాంపల్లి స్టేషన్ రోడ్ వరకు 570 మీటర్ల డ్రెయిన్ నిర్మాణం. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నగరంలో రోడ్లు, నాళాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం అని తెలిపారు.

లక్డీకాపూల్ నుంచి నాంపల్లి ఎగ్జిబి షన్ గ్రౌండ్స్ వరకు నిర్మించే ఈ వరదనీటి కాలువ పనులను త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాద వ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.