21-06-2025 01:23:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో ఎస్‌ఐ బీ మాజీచీఫ్ ప్రభాకర్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తనను నియమించిన నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు జరిపినట్లు ప్రభాకర్‌రావు సిట్ అధికారు లకు తెలిపినట్లు సమాచారం.
దీంతో ఈ కేసులో మాజీ డీజీ పీ పాత్రపై ఉత్కంఠ నెలకొంది. పోలీసువర్గాల నుంచి అందుతున్న సమా చారం ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఐదో విడత సిట్ ముందు ఎనిమి ది గంటలపాటు విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు.. ఈ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను అప్పటి డీజీపీ మ హేందర్‌రెడ్డే నియమించారని, ఆయన ఆదేశాల మేరకే తాను పనిచేశానని ప్రభాకర్‌రావు సిట్‌కు చెప్పినట్లు సమాచారం.
అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ తనకు తెలియదని కూడా ప్రభాకర్‌రావు పేర్కొన్నట్లు తెలుస్తోం ది. దీంతో ఈ కేసులో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని కూడా త్వరలో విచారించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. సిట్ అధికారులు జరిపిన విచారణలో కీలక అంశాలు వెలుగుచూశాయి.
2023 నవంబర్‌లో ట్యాప్ చేసిన సమాచారం మినహా మిగిలిన డేటా మొత్తం ధ్వంసమైనట్లు సిట్ గుర్తించింది. దీంతో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌నంబర్ల ఆధారంగానే సిట్ అధికారులు విచా రణ జరుపుతున్నారు. బాధితులు గా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలను నమోదుచేసి, వారిని సాక్షులుగా పరిగణిస్తున్నారు. అలాగే ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్‌రావు పాత్ర ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
తెలియదు.. గుర్తు లేదు..
ప్రభాకర్‌రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఐదు రోజులకు పైగా గంటల తరబడి విచారించినప్పటికీ, చాలా ప్రశ్నలకు తనకు తెలియదు.. గుర్తు లేదు.. అనే సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం. పోలీస్ ఆఫీసర్ కావడంతో ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెపుతున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి లభించిన ‘రిలీఫ్’ కారణంగానే ప్రభాకర్‌రావు విచారణకు సహక రించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై ఆగస్టు 4న సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది.
బండి సంజయ్‌కు సిట్ పిలుపు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న క్రమంలో తాజాగా మరో కీలక అంశం బయటపడింది. కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు ఆయ న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సిబ్బం ది ఫోన్లు సైతం గతంలో ట్యాప్‌అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శు క్రవారం రాత్రి కేంద్రమంత్రి బండి సంజయ్ కు సిట్ అధికారులు ఫోన్ చేసి..మీ ఫోన్ ట్యా ప్ అయ్యిందని, విచారణకు హాజరై వా ంగ్మూలం ఇవ్వాలని సమయం కోరారు.
రా ష్ట్రంలో ఎప్పటివరకు అందుబాటులో ఉంటారని అడగగా, ఈనెల 23వరకు ఉంటానని స ంజయ్ చెప్పారు. ఈలోపు ఆయన్ను పిలిచి వాంగ్మూలం తీసుకోనున్నారు. అలాగే బండి సంజయ్ అనుచరుడు, బీజేపీ కరీంనగర్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించారు. అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగిన టెన్త్ పేపర్ లీకేజీ, భైంసా అల్లర్లు సహా పలు ఘటనల సమయంలో సంజయ్ వెంటే ప్రవీణ్‌రావు ఉన్నారు. పోలీసులు ఆయనకు ఫోన్ చేసి సిట్ విచారణకు రావాలని ఆదేశించారు.