calender_icon.png 1 November, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాపై 10శాతం సుంకాలు తగ్గింపు

31-10-2025 01:43:00 AM

-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం

-దక్షిణకొరియాలో జీ జిన్‌పింగ్‌తో భేటీ

-అరుదైన ఖనిజాల ఎగుమతులకు బీజింగ్ అంగీకారం

-తాజా ఒప్పందంతో 57% నుంచి 47% తగ్గిన సుంకాలు

వాషింగ్టన్/ బీజింగ్, అక్టోబర్ 30: అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఉద్రి క్తతలు కొనసాగుతోన్న వేళ ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జీ జిన్‌పింగ్ భేటీ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దక్షిణ కొరియాలోని బూసాన్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా గురువారం ఉదయం వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదా పు రెండు గంటలపాటు ద్వైపాక్షిక చర్చలు సాగించారు. భేటీ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ముందుగా జీ జిన్‌పింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

జిన్‌పింగ్ గొప్పనేత అని, ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానని కితాబునిచ్చారు. అనంతరం చైనాపై అమెరికా 10శాతం మేర సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఫెంటనిల్ తయారీలో వాడే ముడిఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు జీ జిన్‌పింగ్ అంగీకరించారని, దీంతో తాము 20శాతం ఫెంటనిల్ సుంకాన్ని 10శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేశారు. చైనా అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగమతి చేస్తే, తాము ఎదుర్కొంటున్న సమస్యకూ పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే అమెరికా నుంచి సోయాబి న్‌ను దిగమతి చేసుకునేందుకూ జీ జిన్‌పింగ్ అంగీకరించారని వెల్లడించారు. ఉక్రెయిన్ -రష్యా యుద్ధాన్ని ఆపేందుకు చైనా కూడా త మతో కలిసి వచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఆ త ర్వాత వీలు చూసుకుని జిన్‌పింగ్ కూడా అమెరికాకు వస్తారని అన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో చైనాపై అమెరికా విధిస్తున్న సుంకం 57శాతం ఉండగా, అది కాస్త 47శాతానికి దిగి రానుంది. అరుదైన ఖనిజాల ఎగుమతి అంశంలోనే గతంలో ట్రంప్ చైనా పై 100శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా జరిగిన తాజా ఒప్పందంతో ఇక చైనాకు ఊరట ల భించినట్లయింది. ట్రంప్ త్వరలోనే చైనాతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారనే చర్చ అంతర్జాతీయంగా మొదలైంది.

ఎయిర్‌పోర్టులోనే ఎందుకు..?

జీ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీకి దక్షిణకొరియాలోని బూసాన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వేదికైందంటే.. ట్రంప్ బుధవారమే దక్షిణకొరియా నుంచి తిరిగి అమెరికా వెళ్లిపోవాల్సింది. అంతకంటే ముందే ఆయన జీ జిన్‌పింగ్‌తో భేటీ కావాలని ఆయన భావించారు. కానీ, సమయాభావం కారణంగా అది సాధ్యపడలేదు. చివరి నిమిషంలో వీరిద్దరూ భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం ఉదయం ఎయిర్‌పోర్టులోనే రెండు గంటల పాటు భేటీ అయ్యారు.