calender_icon.png 30 October, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు టార్పాలిన్లు కచ్చితంగా అందజేయాలి

30-10-2025 05:48:01 PM

- సన్నరకం ధాన్యం మిల్లర్లు తీసుకోవాలి

- వర్షం తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలి

- వరి కోతలు వాయిదా వేసుకోవాలి

- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

-జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలన

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంఛార్జి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో  ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీలించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.

వర్షాల నేపథ్యంలో రైతులు వరి కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అన్ లోడ్ చేసుకునేలా చూడాలని, సన్నరకం వడ్లను కూడా తీసుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాశ్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.