calender_icon.png 30 October, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం

30-10-2025 05:49:13 PM

మందమర్రి (విజయక్రాంతి): భీమిని మండల కేంద్రంలో  ఇటీవల ప్రమాదవశాత్తు  వాగులో పడి మృతిచెందిన చిర్రం కార్తీక్ కుటుంబ సభ్యుల ను  కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం పరామర్శించారు. గురువారం భీమిని లోని బాధిత కుటుంబ సభ్యులను కలిసి సంఘటన వివరాలను అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు కుల సంఘం తరపునా  ఎల్లవేళలా అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే జిల్లా కురుమ సంఘం తరఫున ఆర్థికంగా ఆదుకుంటామ న్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన కురుమ సంఘం నాయకులు కత్తి రమేష్, కొమ్ము మల్లయ్య, చిర్రం పోషం, నారా తిరుపతి,  ముదిగిరి రాజయ్య, చిర్రం పర్వతాలు పాల్గొన్నారు.