31-10-2025 01:07:12 AM
 
							జహీరాబాద్, అక్టోబర్ 30 :డి.డి.ఎస్ - కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మూడు రోజుల శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటిరోజు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి.వరప్రసాద్ మాట్లాడుతూ రైతులు అన్ని పద్ధతులు పాటిం చినప్పటికీ కాయ నాణ్యత, దిగుబడి, పువ్వు రాలడం అనేది ఎక్కువగా మాకు వస్తున్న సమాచారమని, దీనికి శాస్త్రవేత్తలు సమస్యను గుర్తించి తేనెటీగల పెట్టెలను రకరకాల పంటల్లో పెట్టి వాటి ఉత్పత్తిని గమనించడం జరిగిందన్నారు.
వ్యవసాయంలో సుస్థిర పద్ధతులను పాటిస్తూ తేనెటీగలని సంరక్షించు కోవాలని తెలిపారు. ఇందులో భాగంగా కోర్స్ ఇన్చార్జ్ డా. ఎన్ స్నేహలత, సస్యరక్షణ శాస్త్రవేత్త మూడు రోజుల కోర్సు కు సంబంధించిన వివరాలను తెలిపి రోజువారిగా వివరిస్తారని తెలిపారు. తేనె పరిశ్రమకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలను అలాగే శిక్షణ ఉపయోగించుకోవాలని తెలిపారు. చివరి రోజులో భాగంగా కె.వి.కె సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో 20 మంది రైతులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.