calender_icon.png 2 July, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే..

02-07-2025 12:25:52 AM

  కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ - 

  తాడ్వాయి, జూలై 1( విజయ క్రాంతి ), విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులను ఎంతో శ్రద్ధతో చూసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. వారికి ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని కోరారు.

అనంతరం ఉన్నత పాఠశాల కు వెళ్లి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్ని రకాల విద్యా బోధన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. విద్యార్థులను ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు.

అనంతరం అక్కడే నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నాణ్యతగా ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు. బిల్లులు లబ్ధిదారులకు సకాలంలో అందించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, నాయకులు శ్యామ్ రావు, చంద్రం పాల్గొన్నారు.