02-07-2025 12:25:20 AM
కరీంనగర్, జూలై 1 (విజయ క్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్, మంకమ్మతోటలోని పారమిత ఉన్నత పాఠశాలల్లో మంగళవారం జాతీ య వైద్యుల దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని వారి అమూల్యమైన సలహాలను అందించారు. ప్రాణాపాయ స్థితిలోనున్న వారిని కాపాడడమే డాక్టర్ల ప్రధాన కర్తవ్యమని తెలిపారు.
ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్త్ క్యాంప్ నిర్వహించి, నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి తగి న సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వైద్యులను ప్రశంసించి, వారిని ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాలల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్స్ అనూకర్ రావు, రశ్మిత, ప్రసూన, రమణ, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధా నోపాధ్యాయులు గోపీకృష్ణ, బాలాజీ, ప్రశాంత్, కవితాప్రసాద్, సమన్వయ కర్తలు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.