09-09-2025 12:00:00 AM
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే
బిచ్కుంద సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగి పంట నష్టం, ఆస్థి నష్టం సంభవించగా.. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే అధికారు లతో మాట్లాడుతూ... నష్ట పోయిన పంట పొలాల్లో పూర్తి స్థాయి అంచనాలతో నివేదిక సిద్ధం చేయాలని, పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించే దిశగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించి రైతులు సాగు చేసుకోవడానికి ఇబ్బం దులు లేకుండా చూడాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, చెరువు కట్టలు, కాలువల మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం అంచనాలతో కూడిన ప్రతి పాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.