calender_icon.png 28 July, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు

28-07-2025 12:19:52 AM

సూర్యాపేట, జూలై 27 (విజయక్రాంతి) : జిల్లాలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులో అందిస్తావని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లతో కలిసి సూర్యాపేట మండలంకి చెందిన వారికి నూతన రేషన్ కార్డులు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 32,274 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయటం ద్వారా కొత్తగా 95,309 మందికి సన్నబియ్యం పొందే హక్కు లభించిందన్నారు. అలాగే నేడు సూర్యాపేట మండలంలో 4,016 నూతన కార్డుల ద్వారా 12,193 మందికి సన్నబియ్యం పంపిణి అర్హత లభించిందన్నారు.

తదుపరి తెలంగాణ పర్యాటక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ, నూతన్ రేషన్ కార్డులు మంజూరు చేసినందుకి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.   నంతరం సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వటం,

అలాగే సన్నబియ్యం ఇవ్వటం చాలా సంతోషం అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు లో ఎంతమంది ఉన్న నలుగురి కి మాత్రమే 4 కేజీ ల చొప్పున ఇచ్చారని తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్డులో ఉన్న అందరికి 6 కేజీ ల చొప్పున ఇచ్చామని తెలిపారు.రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా తయారు చేసిన ఆర్ ఎన్ ఆర్ ధాన్యం సేకరించి  నాణ్యమైన సన్నబియ్యం పంపిణి చేయాలని సూచించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసాక అన్ని అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవరావు, గ్రంధాలయ సంస్థల చైర్మన్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్ది, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్,డి ఎస్‌ఓ మోహన్ బాబు, తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.