28-07-2025 12:19:19 AM
తుర్కయంజాల్, జులై 27:ప్రజల అవసరాలు, ఐక్యత, వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని ఇంజాపూర్ వాస్తవ్యులు బత్తుల జగదీశ్ గౌడ్, నవీన్ గౌడ్ ఆకాంక్షించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ మిథానీ కాలనీ ముఖద్వారం (ఆర్చ్)ను సొంత ఖర్చులతో నిర్మించారు.
తమ తండ్రి బత్తుల మల్లేష్ గౌడ్ జ్ఞాపకార్థం ఆర్చ్ నిర్మించి, ఆదివారం ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కీ.శే. బత్తుల మల్లేష్ గౌడ్ సతీమణి పద్మ, ఆయన కుమారులు జగదీశ్ గౌడ్, నవీన్ గౌడ్, కాలనీసభ్యులు లక్ష్మారెడ్డి, పల్సం బుచ్చయ్యగౌడ్, కందికంటి ధన్రాజ్ గౌడ్, సంరెడ్డి ప్రసూన్ రెడ్డి, నర్సింహ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండ్లపల్లి ధన్రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.