24-07-2025 07:11:41 PM
రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి..
భూత్పూర్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి(Additional Collector Enugu Narasimha Reddy) అన్నారు. గురువారం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ సారిక టౌన్ షిప్ లో తెలంగాణ మహాత్మాజ్యోతిరావు పూలే బిసి బాలికల గురుకుల పాఠశాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి సందర్శించారు. విద్యార్థినిలు చదువుపై దృష్టి పెట్టి బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలని అన్నారు.
వంట చేసే సిబ్బంది పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న చెప్పాలని, సదుపాయాలను అందుబాటులో ఉంచి మీరు బాగా చదువుకోవాలని లక్ష్యంతోనే ఉపాధ్యాయులంతా శ్రమిస్తున్నారని తెలిపారు. అందుకు తగ్గట్టు బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.