calender_icon.png 2 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 నిమిషాల్లోనే ఖతమ్

02-01-2026 12:00:00 AM

  1. న్యూజిలాండ్‌తో తొలి వన్డే
  2. హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు
  3. రోకో జోడీనే కారణం

వడోదర, జనవరి 1 : సాధారణంగా క్రికెట్ మ్యాచ్ టికెట్లకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. గత కొంతకాలంగా టీ20 మ్యాచ్ టికెట్లే గంటల వ్యవధిలో అమ్ముడవం చూసాం. కానీ ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్లు కేవలం 8 నిమిషాల్లోనే ఖతమ్ అయ్యాయి. టీ20 మ్యాచ్ టికెట్లు గతంలో గంట లేదా రెండు గంటల్లో అమ్ముడైన సందర్భాలున్నాయి. అయితే వన్డే మ్యాచ్ టికెట్లు ఈ స్పీడ్ అమ్ముడవడం రికార్డుగానే చెప్పాలి.  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే దీనికి కారణం.. ఎందుకంటే రోకో జోడీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.

అభిమానులు వీరి ఆటను చూ సేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 7 నెలల గ్యాప్ తో ఆసీస్ టూర్ లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ , కోహ్లీ అదరగొట్టారు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ దుమ్మురేపారు. అంతేకా దు దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బరిలోకి దిగి శతకాలు బాదా రు. ఈ సూపర్ ఫామ్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

2027 వన్డే ప్ర పంచకప్ వరకూ కేవలం వన్డేల్లో మాత్రమే రోకో జోడీ కనిపించనుండడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వారి ఆటను మిస్ అవ్వకూడదని ఉవ్విళూ్ళురుతున్నారు. వారి ఉత్సాహం ఫలితమే వడోదర వేదిక జనవరి 11న జరిగే తొ లి వన్డే టికెట్లు కేవలం 8 నిమిషాల్లో అమ్ముడైపోయాయి.

దీంతో రోహిత్ , కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ క్రేజ్ ఇదీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మిగిలిన రెండు వన్డేలకు సైతం ఇదే తరహా క్రేజ్ నెలకొంది. కాగా జనవరి 11 నుంచి వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనున్నాయి.