27-10-2025 01:44:08 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టం గన్ కల్చర్‌కు, జిహాదీ మూకల వీరంగానికి అడ్డాగా మారిందని విశ్వహిందూ పరిషత్ (వీహెపీ) రాష్ర్ట ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి తీవ్రంగా ఆరోపించారు. ఇక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ర్టంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయా లకు వత్తాసు పలుకుతూ నేరగాళ్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమె త్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శనివారం హైదరాబాద్‌లో పోలీస్ అధికారిపై జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావిస్తూ, గ్లోబల్ సిటీగా చెప్పుకునే హైదరాబాద్‌లో మారణాయుధాలు నాట్యం చేస్తున్నాయని పేర్కొన్నా రు.
నిన్నగాక మొన్న నిజామాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పట్టపగలే కత్తితో పొడిచి చంపారని, ఇప్పుడు ఏకంగా ఓ ఐపీఎస్ అధికారిపైనే కాల్పులకు తెగబడ్డారంటే, జిహాదీల బరితెగింపు ఎంతగా పెరిగిపోయిం దో సమాజం అర్థం చేసుకోవాలని బాలస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో నిందితుడిపై వందల కేసులు ఉన్నప్పటికీ, వారిపై చార్జిషీట్లు దాఖలు చేయకుండా పోలీసులు ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ర్టంలో ఉన్న అక్రమ మారణాయుధాలను గుర్తించి, రౌడీషీటర్ల వివరాలను బయటపెట్టాలని, చట్టవ్య తిరేకంగా వ్యవహరించే జిహాదీలపై ప్రభు త్వం తక్షణమే ఉక్కుపాదం మోపాలని, లేదంటే ప్రజలు పోలీసు యంత్రాంగంపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల గోరక్షకులపై కూడా జిహాదీ మూకలు కాల్పులకు తెగబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పోలీసులకే రక్షణ కరువైన ఈ రాష్ర్టంలో, ఇక సామాన్య ప్రజలకు ‘మీరెలాంటి భరోసా కల్పిస్తారు?’ అని బాలస్వామి రాష్ర్ట ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, రౌడీషీటర్లే పోలీస్ యంత్రాంగానికి సవాలు విసురుతున్నట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసిందని పేర్కొన్నారు.