14-12-2025 04:56:08 PM
లక్షెట్టిపేట టౌన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని అంకతివాడకు చెందిన యువకులు ఆదివారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్ రావు, జనరల్ సెక్రెటరీ సామ వెంకటరమణ, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.