14-12-2025 05:01:11 PM
మాజీ సర్పంచ్ మా రెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి
చండూరు (విజయక్రాంతి): స్థానిక మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మండలంలోని శిర్దపల్లి సర్పంచ్ అభ్యర్థి ధామర బుచ్చి రాములు ఓడిపోయిన సందర్భంగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ మారెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి ఆదివారం కుటుంబాన్ని కలిసి మనోధైర్యం చెప్పి ఆదుకుంటామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక సర్పంచ్ కు ప్రతినెలా ఇచ్చే జీతం రూ. 6,500 మాధురిగానే ఓడిన సర్పంచ్ దామర బుచ్చిరాములుకు కూడా రూ.6,500 ప్రతినెల గౌరవేతనంగా అందిస్తామని వారు హామీ ఇచ్చారు.
కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా సాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం గెలిచిన వార్డు మెంబర్లకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పోలా వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె లింగయ్య, గంట గణపతి, కర్నాటి మహేష్, జోగి రెడ్డి, గంట రవి, సత్యనారాయణ సురేష్, గంట మల్లయ్య పాలకూరి యాదయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తా .. బుచ్చి రాములు:
ఇటీవల స్థానిక ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి సహకరించినందుకుగాను, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులు ఇచ్చిన ప్రజా తీర్పు మేరకు గౌరవిస్తా అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు.