06-01-2026 05:51:04 PM
నగర మేయర్ గుండు సుధారాణి
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా ఆటలను కూడా ప్రోత్సహిస్తుందని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెస్ బోర్డ్, క్రీడా సామగ్రినీ చెస్ నెట్వర్క్ ఫౌండర్ ప్రెసిడెంట్ కోదాటి సుధీర్ రావు ఆధ్వర్యంలో సామల జయప్రకాష్ ఫౌండేషన్ మరియు మన అమెరికన్ తెలుగు సంఘం(మాట) సహకారంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని,విద్యార్థులకు చెస్ కు సంబంధించిన మెటీరియల్ పంపిణీ చేసి చెస్ క్రీడా ప్రాధాన్యతను వివరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి క్రీడలను ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ సమావేశంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ పెరిగి క్లిష్టమైన పరిస్థితుల నుండి ఏ రకంగా పరిష్కరించుకోవాలనేటువంటి నైపుణ్యాలను తెలివితేటలను నేర్పుతోందని,
అలాగే ఉన్నతమైన ఆశయాలను సాధించడానికి ఒక సాధనంగా విద్యతో పాటు క్రీడలు కూడా దోహదం చేస్తాయని వివరించారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు,ప్రత్యేకంగా యువతీ యువకులు నిరుద్యోగ సమస్యతో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆందోళనకు గురవుతున్నారని, యువతలోని నైపుణ్యాలను ఉపయోగించుకొని మానసికంగా దృఢంగా మారడానికి ఇలాంటి క్రీడలు దోహదం చేస్తాయన్నారు.