25-04-2025 12:46:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణవా సులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటకులకు తగిన సహాయం అందిస్తామన్నారు.
ఈ ఘటనపై తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికా రులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారని వెల్ల డించారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాలని తెలం గాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను కోరినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహా యం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు, స్నేహితులు కూ డా సమాచారం తెలుసుకునేందుకు 9440 816071, 9010659333, 040 23450 368, 7032395333, 1800 425 4646 4 నెంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.