18-09-2025 12:36:48 AM
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
అర్మూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరం అవుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేల్పూర్‌లో మాట్లా డుతూ.. రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారని వాపో యారు. చెప్పులు, పాస్‌బుక్‌లు లైన్‌లో పెట్టే పరిస్థితి మళ్లీ వచ్చిందన్నారు. కమీషన్లు దండుకోవడం మీదనే దృష్టి పెట్టారు తప్ప ప్రజల, రైతులు కష్టాలు మాత్రం పట్టవని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు 16 మంది ఎంపీలు ఉన్నా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడని మీ పదవులు ఎందుకని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు పలుకుబడి ఉంటే ప్రధాని మోదీ మోడీ దగ్గరకు వెళ్లి యూరియా తెప్పించాలని సూచించారు. మోదీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదని విమర్శించారు.