calender_icon.png 13 August, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే సన్నబియ్యం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ

13-08-2025 12:00:00 AM

  1. ప్రజలకు ప్రజా ప్రతినిధులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
  2. చివర ఆయాకట్టు నీరు అందించిన ఘనత మీ విజ్జన్నదే
  3. కాల్వ శ్రీరాంపూర్ లో సోలార్ విద్యుత్ ఫ్లాంట్‌కు శంకుస్థాపనలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

మంథని, ఆగస్టు 12(విజయ క్రాంతి): సన్న బియ్యం ఇచ్చే రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణరావు అన్నారు. మంగళవారం నియోజక వ ర్గంలోనికాల్వశ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి, పాత మడిపల్లి, ఆశన్నపల్లి, పెగడపల్లి గ్రామాల్లో మంగళవారం సీసీ రోడ్లు, ప్ర భుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలను ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్లకు ము గ్గులు పోసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి ప్రోసిడింగ్స్ ఎమ్మెల్యే విజయరమణా రావు  వారికి పత్రాలను అందజేశారు.

అనంతరం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నూతన సోలార్ విద్యుత్ ఫ్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాప న చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక కేవలం సంవత్సరాల లోపే ప ది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, గత బిఆర్‌ఎస్ పాలనలో పది సంవ త్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకకు పోయిందని, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేయలేద ని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రై తుల వడ్లు తరుగు పేరా దోపిడీ చేశారే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిన దాఖలాలు లేవన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాక రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ విషయములో ఏమైనా అ నుమానాలు ఉంటే మీ మీ గ్రామాల్లోని ము ఖ్య కూడళ్లలో రుణమాఫీ రైతుల పేర్లు, ఎం త రుణమాఫీ జరిగిన విషయాన్ని గోడ ప్ర తులు అంటించడం జరిగిందన్నారు. రుణమాఫీ విషయములో గగ్గోలు పెట్టే ప్రతిపక్ష నాయకులు రుణమాఫీలో వారి పేర్లు ఉండడంతో ప్రస్తుతం నోరు మూసుకున్నారని, బిఆర్‌ఎస్ నాయకులైన బావా బామ్మర్దులు లేనివి కల్పించి ప్రజలు మభ్య పెట్టే పనిలో పడ్డారని వారి మాటలు ప్రజలు నమ్మేస్థితి లో లేరన్నారు.

చివరి అయ్యాకట్టు వరకు సా గునీరు అందించిన ఘనత తమాదేనన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని మంజూరు కాని నిరుపేదలకు కూడా ఇల్లు ఇవ్వడం జ రుగుతుందని, రాబోయే జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజాన వేన సదయ్య, సింగిల్ విండో చైర్మన్ రాం చందర్ రెడ్డి, మరియు మార్కెట్, సింగిల్ డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఎంపీడీవో, హౌ సింగ్ డిఇ, ఏఈ ఆయా గ్రామాల కార్యదర్శిలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రా మస్తులు తదితరులు పాల్గొన్నారు.