calender_icon.png 17 November, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ శక్తిగా తెలంగాణ జన సమితి

17-11-2025 12:00:00 AM

ప్రొఫెసర్ కోదండరాం

మంచిర్యాల, నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శక పాలన, ప్రజల కోసం నిజాయితీతో పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ జన సమితి నిలుస్తుందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బి. బాబన్న అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో మార్పు కోసమే తెలంగాణ జన సమితి ఏర్పాటు చేయబడిందని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమానావకాశాలు లభించాల్సిన అవస రం ఉందని స్పష్టం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం అందరం ఐక్యంగా పోరాడాలని, ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఓట్లు, నోట్లు కేం ద్రంగా కాకుండా ప్రజల జీవితాలు, ప్రజల సమస్యలు కేంద్రంగా రాజకీయాలు జరగాలన్నారు. ప్లీనరీలో జిల్లా నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సభ్యుల విస్తరణ, ప్రజా పోరాటాల కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మా నాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కవి అందెశ్రీకి నివాళులు అర్పించారు.

నూతన కమిటీ ఎన్నిక...

మంచిర్యాల జిల్లా నూతన కమిటీని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్ రాంచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోనెల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎండి సిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీరటీ రాజన్న, విద్యార్థి, యువ జన సమితి జిల్లా అధ్యక్షులుగా బచ్చలి ప్రవీణ్ కుమార్ లను ఎన్నుకున్నారు.