17-09-2025 01:49:07 AM
మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర డిమాండ్
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 1947న భారతదేశ వానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు మాత్రం రాలేదన్నారు.
నిజాం నియంతత్వం రజాకార్ల ఆకృత్యాల మధ్య తెలంగాణ ప్రజలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం రాజ్యంలో వందేమాతరం అంటే శిక్షలు అనుభవించారు. నిజాం ప్రభుత్వం లో తెలంగాణ ప్రజలు నరకం చూశారని తెలంగాణ రాష్ట్రం సహా మహారాష్ట్ర కర్ణాటకలోని పలు జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్న నిజాం సొంత ఇస్లామిక్ దేశంగా ఉండాలని భావించాడు.
నియంతృత్వాన్ని ఎదిరించిన ఇక్కడి ప్రజలు వీరత్వానికి ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ ఆక్షన్ చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తోడవడంతో భారత సైన్యం చేతిలో ఓడిన నిజాం 1948 సెప్టెంబర్ 17న లొంగిపోవడంతో తెలంగాణ స్వాతంత్రం లభించిందని వివరించారు. ఒక ప్రాంతానికి స్వేచ్ఛ స్వాతంత్రం లభించి న రోజు అంటే అది పెద్ద పండుగ రోజు కానీ తెలంగాణకు స్వాతంత్రం దక్కిన సెప్టెంబర్ 17 మాత్రం ఇక్కడ ఏ ప్రత్యేకత లేకుండా నేటి తరానికి తెలియకుండా తొక్కి పెట్టారని ఆరోపించారు.
జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, సీనియర్ నాయకులు పోతంశెట్టి రవీందర్ గారు కర్నాటి ధనంజయ గారు దాసరి మల్లేశం గారు పడమటి జగన్మోహన్ రెడ్డి ఏలె చంద్రశేఖర్ గారు ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నర్రోతం రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, జిల్లా కార్యదర్శి లు మేడి కొటేష్ ,
తడిసిన మల్ల రెడ్డి, మాయ దశరథ విజయ భాస్కర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహ్మ రావు, మీడియా కన్వీనర్ ఆకుతోట రామ కృష్ణ, సుధాగాని ఉదయ్, భువనగిరి పట్టణ అధ్యక్షుడు , మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, మేకల రవీందర్, రెడ్డి, డి ఎల్ ఎన్ గౌడ్, సుర్వి శ్రీనివాస, మాయదశరద, పట్నం కపిల్ పాల్గొన్నారు.