calender_icon.png 14 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

19-12-2024 04:12:27 PM

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ గురువారం నాడు‌ విడుదలైంది. 2025లో మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ టైమ్‌టేబుల్‌ను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ bse.telangana.gov.in లో ప్రకటించింది. తెలంగాణ బోర్డు టీఎస్ 10వ తరగతి హాల్ టికెట్లను కూడా మార్చిలో విడుదల చేయనుంది. 

పదోతరగతి పరీక్షలు షెడ్యూల్

మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్

మార్చి 24న ఇంగ్లీష్

మార్చి 26న గణితం

మార్చి 28న ఫిజిక్స్

మార్చి 29న బయాలజీ

ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్