05-05-2025 02:10:58 AM
హాజరై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
చేవెళ్ల , మే 4 : చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పోతరాజులు, డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు మల్లన్న ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం మల్లన్న కల్యాణం వేద పండితుల నడుమ కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు.
ఆలయ ఆవరణలో భక్తులకు గ్రామస్తులు కావలి కృష్ణ, పాటి రవీందర్రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, దేవునిఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, హైదరాబాదర్ బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి,
బీఆర్‌ఎస్ బీసీ సెల్ మండల మాజీ అధ్యక్షుడు ఎదిరె రాములు, గ్రామస్తులు ఎదిరె శ్రీశైలం, సామ కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, సామ విఠల్రెడ్డి, మహేందర్, పాండు, బక్కయ్య, అంగరెల్లి రాజు, ఎదిరె యాదయ్య, కరికె విఠలయ్య, మాజీ సర్పంచ్ శ్యామలయ్య, కరికె సత్యనారాయణ, మాణిక్యం, నర్సింలు, గ్రామస్తులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.