calender_icon.png 11 September, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు టైటాన్స్ విజయం

08-12-2024 12:48:21 AM

పీకేఎల్ 11

పుణే: యూపీ యోధాస్ 36 తేడాతో పునేరి పల్టన్ మీద విజయం సాధించింది. యోధాస్‌లో గగన్ గౌడ 15 పాయింట్లతో సత్తా చాటాడు. స్టార్ రెయిడర్ భవానీ రాజ్‌పుత్ (6) కూడా సత్తా చాటడంతో యూపీ యోధాస్‌కు చివరకు విజయం దక్కింది. చివరి మ్యాచ్ డ్రాగా ముగిసినా కానీ పునేరితో మ్యాచ్‌లో విజయం సాధించి టచ్‌లోకి వచ్చింది. ఇక మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34 తేడాతో బెంగాల్ వారియర్జ్‌పై విజయం సాధించింది.

తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ విజయ్ మాలిక్ (11) సూపర్ టెన్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెంగాల్ వారియర్జ్‌లో కూడా స్టార్ రెయిడర్ మనీందర్ సింగ్ (14) సూపర్ టెన్ సాధించినా కానీ ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ మాలిక్‌కు తోడుగా ఆశిశ్ నర్వాల్ కూడా (9) పాయింట్లతో సత్తా చాటాడు. నేడు పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, యూ ముంబాతో గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.